తండ్రి అరెస్ట్: 8 మంది చిన్నారులకు విముక్తి
- November 28, 2017
అభా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సోషల్ ప్రొటెక్షన్ యూనిట్ అసిర్లో, ఓ కసాయి తండ్రి నుంచి 8 మంది చిన్నారుల్ని రక్షించింది. గృహ హింస ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. మీడియాలో కసాయి తండ్రి గురించిన వార్తా కథనాలు వెలువడ్డంతో నిందితుడ్ని పట్టుకుని, చిన్నారులకు విముక్తి కల్పించారు. చిన్నారుల్ని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, నిందితుడ్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం తరలించారు. యాంటీ అబ్యూజ్ చట్టం కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మినిస్ట్రీ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







