రేపు ప్రారంభం కానున్న గల్ఫ్ వారసత్వ ఉత్సవం

- November 30, 2017 , by Maagulf
రేపు ప్రారంభం కానున్న గల్ఫ్ వారసత్వ ఉత్సవం

కువైట్ : గల్ఫ్ లో ప్రాముఖ్యమైన వారసత్వ ఉత్సవం( గల్ఫ్ హెరిటేజ్ ఫెస్టివల్ ) శబహ్ అల్ అహ్మద్ హెరిటేజ్ గ్రామంవద్ద శుక్రవారం జరగనుంది. పలు వారసత్వ కార్యకలాపాలు 3 నెలల పాటు జరుగనున్నాయి వార్షిక పండుగ యొక్క ఈ అధ్యాయంలో సందర్శకులు ఈ గ్రామంలో నిర్వహించబడే కొత్త విస్తరణలు ,అభివృద్ధి కార్యకలాపాలను అనుభవిస్తారు. వినోదం, పర్యాటకం ,సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. పెద్ద ధియేటర్ కొత్త విశ్రాంతి ప్రాంతాలు, పాత భవనాలు ఇక్కడ  ఉన్నాయి. సరస్సులు, పచ్చని ప్రదేశాలు, సినిమాలు, రెస్టారెంట్లు, కాఫీలు లభించే దుకాణాలు, మ్యూజియంలు మరియు ఒక హోటల్ సందర్శకులకు అందుబాటులో వుంటాయ. ఫెస్టివల్ డిప్యూటీ పర్యవేక్షకుడు, పోటీల కమిటీ అధిపతి షేక్ సబాహ్ ఫహాద్ సబాహ్ అల్ నస్సెర్ అల్ సబహ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు  ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారని ఆయన బుధవారం తెలిపారు. పండుగలో ఒంటెలు, గుర్రాలు, పక్షులు మరియు ఇతర ప్రాణుల కోసం వేర్వేరు రకాల పోటీలు ఉంటాయి, ఆయా జంతువుల పోటీలో వేగం, రంగు మరియు అందం మీద దృష్టి పెడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com