పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదు: బాబు
- November 30, 2017
అమరావతి : కేంద్రం లేఖతో పోలవరంపై గంధరగోళం నెలకొని ఉంది. ఈమేరకు ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరంపై మాట్లాడుతూ...కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తానని అన్నారు. పోలవరం పనులు పూర్తి చేస్తానంటే ఆ బాధ్యత కేంద్రానికే అప్పజెప్పి నమస్కారం పెడతానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ దారిపట్టించడం కష్టమన్నారు. బిజేపి పార్టీ మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదన్నారు. కేంద్రం లేఖపై నితిన్ గడ్కరీతో మాట్లాడే ప్రయత్నం చేశానని, గడ్కరీ లండన్ నుంచి రాగానే పోలవరం పై మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









