యుద్ధ వాతారణం నెలకొంటోంది వీరి మధ్య
- November 30, 2017
న్యూయార్క్: యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికా మరోసారి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఎంత చెప్పినా వినకుండా.. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా యుద్ధానికి రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక వేళ యుద్ధమే వస్తే మాత్రం ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. 'ఒక వేళ యుద్ధం వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తాం' అని హెచ్చరించారు.
'ఉత్తర కొరియా నియంత (కిమ్ జోంగ్ ఉన్) యుద్ధాన్నే ఎంచుకుంటున్నారు. మాకు ఇప్పటికీ యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. కానీ, ఆ దేశం యుద్ధానికి దగ్గరగా వస్తోంది' అని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఉత్తర కొరియాతో అన్ని దేశాలు సంబంధాలను తెంచుకోవాలి. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలి పెట్టిన ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ అమలు చేయాలి. ఆ దేశంతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలకు ముగింపు పలకాలి' అని నిక్కీ హేలీ డిమాండ్ చేశారు. అంతేగాక, ఇంతకుముందు ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేయవద్దని చైనాను కోరారు.
దాదాపు రెండు నెలల తర్వాత ఉత్తరకొరియా తాజాగా బుధవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు కిమ్ దేశం ప్రకటించింది. సంబరాలు చేసుకుంది. కాగా, ఈ క్షిపణితో మొత్తం ఉత్తర అమెరికా ఖండం తమ క్షిపణి పరిధిలోకి వచ్చిందని ఉత్తరకొరియా పేర్కొంది.


కాగా, ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా సహా దక్షిణకొరియా, జపాన్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన గంటల వ్యవధిలోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాకు ధీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇది ఇలావుంటే.. బుధవారం రిపబ్లికన్ సెనెటర్ స్టీవ్ రస్సెల్ మాట్లాడుతూ.. ఒక వేళ ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమైతే.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఖచ్చితంగా చంపేస్తామని హెచ్చరించారు. అమెరికా తన రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తే ఉత్తరకొరియా తట్టుకోలేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







