'ఎన్నారై కోఆర్డినేటర్' అర్హత ఆయనకుందా?
- November 30, 2017
లండన్: ఎటువంటి భాష పరిజ్ఞానం , సాహిత్య పరిచయం లేని వ్యాపారవేత్త అయిన మహేష్ బిగాలను తెలుగు ప్రపంచ మహాసభల ఎన్నారై సమన్వయకర్తగా నియమించడాన్ని టిపిసిసి ఎన్నారై సమన్వయకర్త గంప వేణుగోపాల్ తప్పు పట్టారు. ఎమ్మెల్యే గణేష్ బిగల తమ్ముడని చెప్పి ఎన్నారై సమన్వయకర్తగా నియమించి తెలుగు మహా సభల స్థాయిని తగ్గించారని ఆయన ఓ ప్రకటనలో అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ,ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా ,దుబాయ్ ,సింగపూర్ అన్ని దేశాల్లో నిరసన వ్యక్త పరిచి వెంటనే మహేష్ బిగాలను ఆ పదవి నుండి తప్పించేలా చూడాలని ఆయన ఎన్నారైలను కోరారు.
అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగాలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కోఆర్డినేటర్‌గా నియమించారని ఆయన అడిగారు. ఎటువంటి భాష పరిజ్ఞానం ,సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆయన అన్నారు.
మహేష్‌ను వెంటనే తొలగించి ఆ స్థానం లో సాహిత్యవేత్తలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల ఈ పదవి ఇప్పించారని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఎటువంటి సాహిత్య స్పృహ ,భాష ప్రావిణ్యం లేని వాళ్ళు విదేశాల్లో సమావేశాలు పెట్టి ఏమి మాట్లాడుతారని ,ఇది రాజకీయ పదవుల పంపకం కాదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







