పెళ్లి పీటలు ఎక్కనున్న శృతి
- November 30, 2017
కమల్ గారాల పట్టీ శృతి హాసన్ తన పెళ్లి టాపిక్‌తో మరోసారి వార్తలలోకి ఎక్కింది. కొంత కాలంగా లండన్ నటుడు మైఖేల్ కోర్సెల్‌తో సన్నిహితంగా ఉంటున్న శృతి రీసెంట్గా ఆయనని ముంబైకి తీసుకు వచ్చి తన తల్లి సారికకి పరిచయం చేసిందట. అంతేకాదు వీరందరు కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి సరదాగా గడిపారని తెలుస్తుంది. మైఖేల్, శ్రుతి, సారిక కలిసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో త్వరలోనే శృతి పెళ్ళి జరగడం ఖాయమని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెబుతుంది. గతంలోను శృతికి, మైఖేల్‌కి సంబంధించి పలు రూమర్స్ రావడంతో దీనిపై స్పందించిన శృతి దయచేసి తనపై పుకార్లు పుట్టించవద్దని కోరింది. మరి ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం తన తండ్రి తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు చిత్రం తప్ప శృతి మరే ప్రాజెక్ట్ చేయడం లేదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు