ప్రపంచవ్యాప్తంగా మొరాయించిన వాట్సాప్
- November 30, 2017
మెసేజింగ్ సర్వీసుల దిగ్గజం వాట్సాప్ మరోసారి క్రాష్ అయింది. శుక్రవారం ఉదయం వాట్సాప్ పనిచేయకుండా మొరాయించినట్టు యూజర్లు, సోషల్ మీడియాలో ఫిర్యాదుచేశారు. యాప్‌ను యాక్సస్ చేయడంలో వీరికి సమస్యలు తలెత్తినట్టు పేర్కొన్నారు. గత వారం రోజులుగా వాట్సాప్ పనిచేయకుండా అంతరాయం కలుగడం ఇది రెండో సారి. నవంబర్ 3న కూడా ఈ యాప్ క్రాష్ అయింది. తాజా అంతరాయంలో గంటకు లోపు సర్వీసులు నిలిచిపోయాయని, అనంతరం సర్వీసులు పునరుద్ధరణ జరిగినట్టు యూజర్లు తెలిపారు. అర్థరాత్రి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి #వాట్సాప్‌డౌన్ అనే మెసేజ్‌లు ట్వీట్ రూపంలో వెల్లువెత్తాయి. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం ఉత్తర యూరప్, బ్రెజిల్లో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడిందని తెలిసింది. వాట్సాప్ కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లు సర్వీసులను యాక్సస్ చేసుకోలేకపోతున్నారని, కంపెనీ సమస్యను గుర్తించే పనిలో ఉందని పేర్కొంది.
వాట్సాప్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ మంది యూజర్లున్నారు. దీనికి ఉన్న టాప్ మార్కెట్లలో భారత్ ఒకటి. భారత్‌లో 200 మిలియన్‌కు పైగా యూజరున్నారు. మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి భారత్‌లో పేమెంట్స్ సర్వీసులను లాంచ్ చేయాలని కూడా వాట్సాప్ యోచిస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్ దిగ్గజం, తన యాప్పైకి ఎక్కువ సర్వీసులను తీసుకురావాలని చూస్తోంది. ఎస్ఎంఎస్ నుంచి కాకుండా వాట్సాప్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి బుక్‌మైషో ఓ పైలెట్‌ను కూడా టెస్ట్ చేసింది.
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!