త్వరలో జపాన్ యువరాజుకు పట్టాభిషేకం
- November 30, 2017
టోక్యో: జపాన్ చక్రవర్తి అకిహితో తన సింహాసనాన్ని త్యజించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆయన తన సింహాసాన్ని వదులుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని షింజో అబే తెలియజేశారు. రాచ కుటుంబంతో చర్చలు నిర్వహించిన తర్వాత జపాన్ ప్రభుత్వం ఈ తేదీని ప్రకటించడం విశేషం. వయసు, ఆరోగ్యం వల్ల తన విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారిందని 83 ఏళ్ల అకిహితో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చక్రవర్తి అకిహితో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఆ దేశ మంత్రివర్గం గతంలో ఒక బిల్లును ఆమోదించింది. ప్రధానమంత్రి సింజో అబే మంత్రివర్గం ఆ బిల్లుపై సంతకం చేసింది. జపాన్‌లో రెండు శతాబ్దాల కాలంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బిల్లు చట్టంగా మారిన మూడేండ్లలోపు చక్రవర్తి సింహాసనాన్ని పరిత్యజించవచ్చు. 2018 డిసెంబర్ నాటికి సింహాసనం దిగిపోవాలని జపాన్ చక్రవర్తి 83 ఏండ్ల అకిహితో నిర్ణయించుకున్నట్టు, 2019 జనవరి ఒకటి నాటికి సింహాసనానికి వారసుడైన యువరాజు నరుహితోకు ఆ బాధ్యతలు అప్పగించాలనుకున్నట్టు ఇటీవల వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!