దుబాయ్ వాసవి యూత్ NRI ఆధ్వర్యంలో ఘనంగా కార్తీకమాస వన భోజనాలు

- November 14, 2015 , by Maagulf

దుబాయ్ వాసవి యూత్  NRI ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజనాలు అంగ రంగ వైభవంగా 13 నవంబర్ 2015 శుక్రవారము క్రీక్ పార్క్ గేట్ నెంబర్ 4 లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ టివి యాంకర్ మధు మృదుల గారు వ్యాఖ్యతగా వ్యవహరించారు యు.ఏ.ఈ  దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 750 కి పైగా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు వాసవి యూత్ NRI వారు పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు , బెలూన్ మేకింగ్ , మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా లక్ష్మి రావామ్మా మా ఇంటికి  వంటి కార్యక్రమాలతొ గొల్డ్ కాయిన్స్  అందజేయడమే కాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం , ప్రత్యేకంగా ఉలవచారు  ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమంలో భాగంగా  ఇండియా, దుబాయ్, గల్ఫ్ ఒమాన్ లో ఆర్యవైశ్య పెద్దలు MNR గుప్తా ,శ్రీధర్ బేల్డి ,కట్టప్రసాద్ ,విజయ్ బొజ్జ,సురేష్ అనురాధ ఓబుల్ శేట్టి ,యాలమర్తి శరత్ గార్లను   వాసవి యూత్  NRI కార్యవర్గం అత్యంత ఘనంగా సన్మానించారు

వాసవి యూత్ NRI పలు సేవలతో ఒక విధం గా ఆర్ధికమగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్ధులను చదివించడం అభినందనీయం అని సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్  , రఘురాం సందీప్ దిగ్గవల్లి ,యం.యన్.వి సరవన్,శ్రీమతి .సుజన ,శ్రీమతి సంతోషి, సరవన్  ని ప్రశంసించారు . జూలూరు సురేష్ ని ప్రత్యేకంగా అభినందించారు . ఈ సంస్థ రానున్న 4,5 సంవత్సరాలలో గల్ఫ్ దేశాల్లో  లో తన కార్యకలాపాలను విస్తరించాలి అని కోరారు.

ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులైన రఘురాం సందీప్ , జూలూరు సురేష్  లు విచ్చేసిన అతిధులకు , sponsor లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు, సేవలు చేస్తాము అని తెలియచేసారు . జూలూరు హారిక , అవినాష్ , దీపు  , రాజేష్, నాగార్జున,అనిల్ మాజేటి,ప్రసన్న,చరణ్, జగన్,స్రవేష్,వసుధ,సత్య  ప్రవీణ్,శ్రీమతి సమీర,సయీష్,ప్రవీణ్ ,నవీన్,నవీన్, లీల కృష్ణ   లు  ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందచేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com