మహేష్ చిత్రాన్ని కొన్న లహరి
- December 01, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అను నేను". కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం జెడ్-స్వీడుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, ఈ సినిమా ఆడియో హక్కులని లహరి మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అదెంత అనేది మాత్రం చెప్పడం లేదు.
"భరత్ అను నేను" ఓ పొలిటికల్ సటైర్ అంటున్నారు. ఇందులో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ సరసన కైరా అద్వాని జతకట్టనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేష్-కొరటాల కలయికలో వస్తోన్న "భరత్ అను నేను" పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







