భారతీయ రోగికి కతార్ నుండి "బాంబే గ్రూప్" రక్తదాత లభించాడు
- December 01, 2017
కువైట్: రక్త సమూహాలలో అత్యంత వైవిధ్యమైన బొంబాయి రక్తం ఒక రోగికి అవసరం ఏర్పడిందని వార్త ఇటీవల ప్రచురించిన విషయం " మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు విదితమే.. అయితే భారతీయ రోగిని కాపాడటానికి తన అరుదైన రక్తాన్ని దానం చేయటానికి కతర్ ఒక రక్తదాత పెద్ద మనస్సుతో అడాన్ హాస్పిటల్ కి వచ్చాడు. కేరళకు చెందిన వినీత అనే మహిళ అడాన్ ఆసుపత్రిలో చేరిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేసే నిమిత్తం బాంబే గ్రూప్ రక్తం అవసరం ఏర్పడింది. భారతీయ రోగికి అత్యవసరంగా రక్తంలో ప్రత్యేక గ్రూప్ అవసరం ఏర్పడింది. ఈ గ్రూప్ రక్తం అత్యంత అరుదుగా లభ్యమవుతుందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. " బాంబే బ్లడ్ గ్రూప్" అని పిలవబడే ఈ రక్త సమూహం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. 7,600 మంది ప్రజలలో ఒక్కరికి మాత్రమే ఆ రక్తం లభించడంతో ఆ రక్తదాత కోసం రోగి బంధువులు ఆదుర్దా చెందారు. కువైట్ లో ఆ రక్తదాతని పొందడం సాధ్యం కాలేదు, కానీ 'బ్లడ్ డోనోర్స్ ఫోరం, కేరళ - కువైట్ చాప్టర్' తమ ప్రయత్నాలు విడవకుండా కొనసాగించడంతో ఖతార్ లో బాంబే గ్రూప్ రక్తదాత దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఆ బాంబే బ్లడ్ గ్రూప్ దాత సైతం కేరళకు చెందిన నిదిన్ కావడం మరో విశేషం. ఆ వ్యక్తి దోహా లోని అల్ అన్సార్ గ్యాలరీ లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అధికారులను సంప్రదించి, కువైట్ లోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ప్రత్యేక అనుమతులను పొందిన తరువాత, దాత యొక్క రక్త నమూనాలను హమాద్ హాస్పిటల్ బ్లడ్ డోనార్ సెంటర్ లో పరీక్ష తర్వాత కువైట్ అడాన్ హాస్పిటల్ కి పంపించబడింది దోహా, కతర్. 'బ్లడ్ డోనోర్స్ ఫోరమ్, కేరళ - కువైట్ చాప్టర్' రక్తాన్ని ఆ మహిళకు అందచేసేందుకు తీసుకున్న చొరవ స్థానిక ప్రజలను బాగా ఆకర్షించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







