బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే త్వరలో సౌదీ అరేబియాలో పర్యటన

- December 01, 2017 , by Maagulf
బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే  త్వరలో సౌదీ అరేబియాలో పర్యటన

సౌదీ అరేబియా : త్వరలో బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం షియా రెబెల్స్‌ అధీనంలో వున్న యెమెన్‌ ఓడరేవు హొడెదా ద్వారా ఎమెన్‌ ప్రజలకు మానవతా సాయం అందేందుకు అనుమతించాలని ఆమె ఈ సందర్భంగా  కోరనున్నారు. హొడెదా ఓడరేవు ద్వారా పూర్తి స్థాయిలో మానవతా సాయానికి, వాణిజ్య వ్యవహారాలకు వెసులుబాటుగా సౌదీ అరేబియా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు థెరిస్సా మే చెప్పారు.  సౌదీ అరేబియా గత నెల నవంబరు 4 వ తేదీన యెమెన్‌ ఓడరేవులను మూసివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com