ఖమిస్ ముషీత్ లక్ష్యంగా దూసుకువస్తున్న క్షిపణిని సౌదీ ఎయిర్ ఫోర్స్ నేలకూల్చింది
- December 01, 2017
జెడ్డా : దక్షిణ నగరమైన ఖమిస్ ముషిత్ వైపు దూసుకువస్తున్న ఒక క్షిపణిని సౌదీ వాయు భద్రత దళం నేలకూచినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ శుక్రవారం నివేదించింది. యెమెన్ ప్రాంతములో గురువారం రాత్రి 8 : 30 సమయంలో ఒక క్షిపణి ప్రయోగాన్ని సౌదీ రాయల్ ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమై దానిని కనుగొంది. యెమెన్ సరిహద్దు చట్టబద్దమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి పోరాడుతూ ఆ క్షిపణిని నాశనం చేసిందని ధ్రువీకరించారు. సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రతినిధి అల్-మాలికి మాట్లాడుతూ అల్- హుతి సాయుధ తీవ్రవాద సంస్థల వద్ద సూదూర లక్ష్యాలను చేధించే బాలిస్టిక్ ఆయుధాలు ఉన్నాయని వాటి నియంత్రణను సైన్యాధికారులు సరిహద్దుల వద్ద నిరంతర గస్తీలో ఉంటున్నప్పటికీ "ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారేయని అన్నారు. నిషేధించిన ప్రదేశాలలో వారు కాల్పులు జరపడం అంతర్జాతీయ మానవతా చట్టంకి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. తీవ్రవాదులు బాలిస్టిక్ క్షిపణులతో నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







