ప్రముఖ నృత్య దర్శకుడు ధర్మరాజు కన్నుమూత

- December 02, 2017 , by Maagulf

నస్రుల్లాబాద్‌ : ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రభుదేవా అక్కడికి చేరుకొని తన గురువు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. గురువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

కాగా 'లవకుశ', 'సీతారామ కళ్యాణం', 'ఆదిత్య 369', 'పౌర్ణమి' వంటి సుమారు వంద సినిమాలకు పైగా ఆయన డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవాకు నృత్యం నేర్పిన ఘనత ధర్మరాజుకు దక్కింది. హాంకాంగ్‌, హైదరాబాద్‌కు చెందిన పలువురు శిష్యులు ఇతని వద్దే శిక్షణ తీసుకుని ఎంతోమందికి నృత్యం నేర్పుతున్నారు. ధర్మరాజు మృతిచెందాడన్న వార్త ప్రభుదేవాకు తెలియడంతో ఆయన అంకోల్‌ క్యాంపునకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com