ప్రముఖ నృత్య దర్శకుడు ధర్మరాజు కన్నుమూత
- December 02, 2017

నస్రుల్లాబాద్ : ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రభుదేవా అక్కడికి చేరుకొని తన గురువు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. గురువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కాగా 'లవకుశ', 'సీతారామ కళ్యాణం', 'ఆదిత్య 369', 'పౌర్ణమి' వంటి సుమారు వంద సినిమాలకు పైగా ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు నృత్యం నేర్పిన ఘనత ధర్మరాజుకు దక్కింది. హాంకాంగ్, హైదరాబాద్‌కు చెందిన పలువురు శిష్యులు ఇతని వద్దే శిక్షణ తీసుకుని ఎంతోమందికి నృత్యం నేర్పుతున్నారు. ధర్మరాజు మృతిచెందాడన్న వార్త ప్రభుదేవాకు తెలియడంతో ఆయన అంకోల్ క్యాంపునకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







