డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యంగ్ కమెడియన్

- December 02, 2017 , by Maagulf
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యంగ్ కమెడియన్

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో టాలీవుడ్‌కు చెందిన యంగ్ కమెడియన్ నవీన్(కుమారి 21ఎఫ్ ఫేమ్) కూడా ఉన్నాడు. తప్పతాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అనంతరం మీడియాను చూసి భయంతో కారు క్రింద నక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నవీన్‌పై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు, ఆయన కారును సీజ్ చేశారు.

నవీన్‌తో పాటు పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతున్న పలువురు యువతులను కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో దాదాపు 20 మందిపై కేసులు నమోదు చేయగా.. 14 కార్లు, 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com