రజని 'కాలా' రిలీజ్ డేట్ ఫిక్స్
- December 03, 2017
రజనీకాంత్ అభిమానులు, సౌత్ ఆడియన్స్ మొత్తంలో క్రియేట్ అయిన కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. 2.0పోస్ట్ పోన్ తో మొదలైన సందేహాలకు రజనీ ధనుష్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. రోబో సీక్వెల్ పై క్లారిటీ రాకముందే కాలా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.
టు పాయింట్ ఓ సినిమా జనవరి25కు రిలీజ్ కాట్లేదనే టాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాలా సినిమా రిలీజ్ పై డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. 450కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ భారీ ఇమాజినేషన్ తో 2డి,3డిల్లో తెరకెక్కిస్తోన్న ఈసినిమా గ్రాఫికల్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో జనవరి25న రిలీజ్ కాట్లేదని కోలీవుడ్ లో వార్తలు మొదలయ్యాయి. శంకర్ ఈగ్రాఫికల్ వండర్ ను సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నాడనే గాసిప్స్ వచ్చాయి. దీంతో కాలా సినిమా రిలీజ్ డేట్ పై డౌట్స్ స్టార్ట్ అయ్యాయి.
రజనీ మాఫియా డాన్ గా నటిస్తోన్న కాలా సినిమాకు వర్కింగ్ స్టిల్స్ తోనే మంచి బజ్ వచ్చేసింది. వైట్ హెయిర్, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ లో తలైవా లుక్ కు ఫ్యాన్స్ పర్ ప్రైజ్ అయ్యారు. అయితే ఈసినిమా నిర్మాత ధనుష్ మాత్రం టు పాయింట్ ఓ తర్వాత రిలీజ్ చేస్తే, ఆ హిట్ తో బిజినెస్ బావుంటుందని అనుకున్నాడు. అందుకే షూటింగ్ కంప్లీట్ అయినా, జనవరిలో రోబో-2 వస్తుంది కాబట్టి, సమ్మర్ లో సినిమాను దింపాలనుకున్నాడు. కానీ టు పాయింట్ ఓ వేసవికి వాయిదా పడ్డంతో కాలాను 2018 ఇండిపెండెన్స్ డేకు ఫిక్స్ చేశారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







