మహేష్ 25వ సినిమా షూటింగ్ ముహర్తం ఖరారు..!!
- December 03, 2017
మహేశ్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ సెట్స్ కు వెళ్లడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. MB25గా అనౌన్స్ మెంట్ తోనే ప్రిన్స్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచిన ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అయిపోయింది. మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే 25వ సినిమాను సెట్స్ కు తీసుకెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న ఈసినిమా షూటింగ్ జనవరి కల్లా కంప్లీట్ అవుతుందట. వన్స్ ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాగానే, 2018ఫిబ్రవరిలో MB25 షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకుంటోంది యూనిట్.
దిల్ రాజు-అశ్వనీ దత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమా మున్నెళ్ల క్రితమే లాంచ్ అయ్యింది. భరత్ అనే నేను సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి, వెంటనేఈ MB25 షూటింగ్ స్టార్ట్ చేసి పోస్ట్ సమ్మర్ లో సినిమా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ స్పైడర్ సినిమా అనుకున్న టైంకు రిలీజ్ కాకపోవడంతో ఈసినిమాల షెడ్యూల్స్ మారిపోయాయి. 2018ఏప్రిల్ కు భరత్ పోస్ట్ పోన్ అయితే, మహేశ్-వంశీల సినిమా షూటింగ్ ఫిబ్రవరికి మారిపోయింది.
మహేశ్ 25వ సినిమాకు షూటింగ్ లొకేషన్ల సెర్చింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. బౌండ్ స్క్రిప్ట్ తో వంశీ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడట. దీంతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం గ్యాప్ తీసుకోకుండా సినిమాను కంప్లీట్ చెయ్యాలనుకుంటోందట టీం. అయితే షూటింగ్ షెడ్యూల్స్ కు డేట్ ఫిక్స్ అయినా, హీరోయిన్ మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. చాలా మంది సౌత్ స్టార్ హీరోయిన్లు పేర్లు వినిపించినా, యూనిట్ ఇంకా ఎవరినీ ఫైనల్ చెయ్యలేదు. ఇక ఈసినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







