పవన్-త్రివిక్రమ్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న అలనాటి నటి
- December 03, 2017
హైదరాబాద్ : పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. పవన్-త్రివిక్రమ్ సహనిర్మాణంలో కృష్ణచైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో నితిన్, మేఘా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఈ ప్రాజెక్టులో అలనాటి అందాల తార లిజీ కీలక పాత్రలో నటించనుందట. మగాడు, 20వ శతాబ్దంతోపాటు పలు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి పాపులర్‌గా నటిగా పేరు తెచ్చుకున్న లిజీ..పవన్-త్రివిక్రమ్ మూవీతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన లిజీ ఈ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించాలని ఫిక్సయినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







