యూరోపియన్ శాటిలైట్‌కు చిక్కిన ఢిల్లీ కాలుష్యం
- December 03, 2017
న్యూఢిల్లీ: నవంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని కాలుష్యాన్ని యూరోపియన్ శాటిలైట్ నిక్షిప్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడారు.
ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర రూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇదే విషయాన్ని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) కూడా తెలిపింది. ఉత్తర భారతం ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిపే ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
నవంబర్ 10న దేశ రాజధాని ప్రాంతాన్ని కాలుష్యపు మేఘాలు ఏ విధంగా కమ్ముకున్నాయో తెలిపే చిత్రాలను శుక్రవారం విడుదల చేసింది. ఈఎస్ఏకు చెందిన సెంటినల్ 5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీశారు.
భూగ్రహంపై వాతావరణ మార్పుల్ని ఇది పరిశీలిస్తుందని ఈఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ ఎర్త్ అజ్బర్వేషన్ జోసెఫ్ తెలిపారు. నవంబర్ 6 నుంచి 14 మధ్య తక్కువ వాయు వేగం, గాలిలో అధిక తేమ, పంటలను తగలబెట్టడం తదితర కారణాలతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిల్ని దాటింది.
మరో ఉపగ్రహ చిత్రంలో ఉత్తర పాట్నా, దక్షిణ రాయపూర్ ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి వెలవడుతున్ కాలుష్యాన్ని చిత్రీకరించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







