నిషాకళ్ల సిల్క్ స్మిత జీవనతెరను విడిచి 11ఏళ్లు...
- December 03, 2017
ఆ పేరు ఓ సమ్మోహనాస్త్రం. కొన్ని లక్షల హృదయాలను రసడోలికలలో ఊపిన చెరిగిపోని స్వప్నం. 80,90ల్లో దక్షిణాది కుర్రకారుకు కలల రాణిగా మారి నిద్రను అమితంగా ఇష్టపడేలా చేసిన సిల్క్ స్మిత 11వ జయంతి.. నిషాకళ్లతో ఒకప్పడు సౌత్ సినిమా కమర్సియాలిటీకి కేరాఫ్ గా నిలిచిన అందమైన స్వప్నాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం.
హీరో ఎవరు అనేది సెకండరీ, ఫస్ట్ సినిమాలో సిల్క్ స్మిత పాటుందా? లేదా? ఎలాంటి కథైనా సిల్క్ ను చేర్చాల్సిందే! 80,90ల్లో కొన్ని లక్షల మంది డిమాండ్స్ ఇవి. బయ్యర్లు అయితే సిల్క్ తో సై సయ్యా..అని స్టెప్పేయించకపోతే ఆ సినిమా మేం తీసుకోం అని అల్టిమేటమ్ జారీ చేసేవారు. వెండితెర కూడా ఈ వాదనలకు తెగ సంబరపడిపోయి సిగ్గుమొగ్గలు వేసేది అంటే అతి శయోక్తి కాదు అని అప్పటి కుర్రకారు తెగ ఆనందంగా చెప్తారు.
సిల్క్ స్మిత షూటింగ్ జరుగుతోంది అంటే అక్కడ ఫుల్ బందోబస్త్ ఉండాలి. ఆమెను క్యాప్చర్ చెయ్యడానికి కెమెరాకు ఒళ్లంత కల్లుండాలి. అదీ దక్షిణాది సినీ సీమలో సిల్క్ స్మిత రేంజ్. విజయలక్ష్మి గా ఎంట్రీ ఇచ్చి వంది చక్కరమ్ సినిమాతో సిల్క్ గా సిల్వర్ స్క్రీన్ కు హాట్ ఇమేజ్ అద్దింది. ఆ తర్వాత స్టార్ హీరోస్ కూడా ఆమెతో స్టెప్పెయ్యడానికి వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సిల్క్ స్మిత పాటలకు ధియేటర్లు ఊగిపోయేవి. చిల్లర పైసలు, పూల బుట్టలతో ధియేటర్లు నిండిపోయేవి. స్టార్ హీరోయిన్స్ కంటే, ఆ మాటకొస్తే టాప్ హీరోలనే తలదన్నేలా సిల్క్ కు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. ఆ ఇమేజ్ తో సిల్క్ సౌత్ హాట్ క్వీన్ గా మారింది. అప్పటికే ఉన్న జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి వాళ్లను వెనక్కి నెట్టి సెక్స్ బాంబ్ గా మారిన సిల్క్ తర్వాత వచ్చిన కొత్తతరాన్ని ఎదుర్కోవడానికి నిర్మాతగా మారి ఆర్దికంగా నష్టపోవడం, ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో మోసం చెయ్యడంతో సిల్క్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. స్మిత జీవనతెరను విడిచి 11ఏళ్లు అవుతోన్నాఇప్పటికీ సిల్క్ అనే పేరు వింటే పులకించిపోతున్నారంటే అర్దం చేసుకోవచ్చు. ఆ పేరుకు ఎప్పటికీ మరణం లేదని. అందుకే ఆమె కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. సూపర్ హిట్స్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల