కువైట్ లో గత 11 నెలల్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 370 మంది మృతి
- December 03, 2017
కువైట్ : అధికారిక గణాంకాల సూచన ప్రకారం ఈ సంవత్సరం ' రోడ్ రేజ్ ' ఫలితంగా మొదటి 11 నెలలలో ప్రమాదకరమైన పెరుగుదల ఉందని తెలియ చేస్తోంది . జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ (జిటిడి) విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం ఆ నిర్దేశ కాలంలో 80,000 విభిన్న సంఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. వీటి ఫలితంగా 370 మంది కువైట్ వాసులు మరియు ప్రవాసీయులు అకాల మరణం చెందారు.ఈ కాలంలో 10 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాలలో గాయపడినట్లు నివేదికలు ద్వారా వెల్లడైంది.130 మంది ప్రవాసీయులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో వారిని దేశం నుంచి బహిష్కరించారు. 22,000 వాహనాలను వివిధ కారణాలతో స్వాధీనం చేసుకొని అక్కడనుంచి తరలించారు మరియు 1,930 మంది నిర్లక్ష్య వాహనదారులను అధికారులకు వారిని సూచించారు. ఈ కాలంలో 1,450 మిలియన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ఉల్లంఘన నమోదు చేయబడ్డాయి. ఈ కాలంలోనే ఎటువంటి గాయాలకు గురికాకుండా 68,000 మంది ప్రమాదాలకు కారణమయ్యారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడినవారి సంఖ్య 10,000 మంది కాగా 2,279 వాహనాలు విపరీతమైన మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు వారిలో అత్యంత నిర్లక్ష్యంతో వాహనాలు నడిపే 136 మందిని అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!