ఏఐసీసీ అధ్యక్ష పదివికి రేపు రాహుల్ నామినేషన్
- December 03, 2017
కాంగ్రెస్లో రాహుల్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పదివికి రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఆయన్ని సమర్దిస్తూ పార్టీ నేతలు మొదట నాలుగు సెట్ల నామినేషన్లు వేయనున్నారు. ప్రతి పత్రంపై 10 మంది పిసిసి డెలిగేట్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్లు ఆంటోని, ఆజాద్, ఖర్గే తదితరులు సంతకాలు చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, ఎంపీలు, రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేయనున్నారు. ప్రతి రాష్ట్రానికి సగటున రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్ధితిని దృష్ట్యా కేరళకు 4, ఉత్తర ప్రదేశ్కు 6 సెట్లు దాఖలు చేసే అవకాశం లభించింది. ఇప్పటికే ముఖ్య నాయకులంతా ఢిల్లీ చేరారు. సోమవారంతో నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండగా.. ఇప్పటివరకు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. దీంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రాహుల్ ఏఐసిసి అధ్యక్షుడు కాబోతున్నారన్న ఆనందోత్సవాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంబరాలకు కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







