ప్రపంచ తెలుగు మహాసభలు-2017...దుబాయ్ లో సన్నాహక సమావేశాలు

- December 03, 2017 , by Maagulf

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిస్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి యు.ఎ.ఇ. లో నివసిస్తున్న తెలుగు భాషా వికాసానికై పనిచేస్తున్న కవులను,రచయితలను, ఎన్.ఆర్.ఐ లను, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడానికి ETCA-Telangana Jagruthi ఆధ్వర్యంలో  ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన మానకొండూరు శాసన సభ్యులు మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గారు తెలుగు వారందరినీ కలిసి, తెలుగు మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్.ఆర్.ఐ లందరూ తెలుగు మహాసభల్లో బాగస్వాములై కార్యక్రమాలని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

ఈ సందర్బంగా తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు, వక్తలు, రచయితలు, విధ్యావెత్తలు,  కళాకారులు, సంఘాల ప్రతినిధులు హజరు అయ్యారు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

తెలంగాణ గల్ఫ్ బిడ్డలందరూ  ఏన్నో ఏళ్లు గా ఎదిరి చూస్తున్న TNRI పాలసీ ని ప్రకటించవలసింది గా NRI మంత్రి KTR గారిని, CM KCR గారిని కోరుతూ TNRI పాలసీ వినతి పత్రాలను శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారికి ఇవ్వడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com