కువైట్ లో గత 11 నెలల్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 370 మంది మృతి

- December 03, 2017 , by Maagulf
కువైట్ లో గత 11 నెలల్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 370 మంది మృతి

కువైట్ : అధికారిక గణాంకాల సూచన ప్రకారం ఈ సంవత్సరం ' రోడ్ రేజ్ ' ఫలితంగా  మొదటి 11 నెలలలో ప్రమాదకరమైన పెరుగుదల ఉందని తెలియ చేస్తోంది . జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ (జిటిడి) విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం ఆ నిర్దేశ కాలంలో 80,000 విభిన్న సంఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. వీటి  ఫలితంగా 370 మంది కువైట్ వాసులు  మరియు ప్రవాసీయులు అకాల మరణం చెందారు.ఈ కాలంలో 10 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాలలో గాయపడినట్లు నివేదికలు ద్వారా వెల్లడైంది.130 మంది ప్రవాసీయులు  లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో వారిని దేశం నుంచి బహిష్కరించారు.  22,000 వాహనాలను వివిధ కారణాలతో స్వాధీనం చేసుకొని అక్కడనుంచి తరలించారు మరియు 1,930 మంది నిర్లక్ష్య వాహనదారులను అధికారులకు వారిని సూచించారు. ఈ కాలంలో 1,450 మిలియన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ఉల్లంఘన నమోదు చేయబడ్డాయి. ఈ కాలంలోనే ఎటువంటి గాయాలకు గురికాకుండా 68,000 మంది ప్రమాదాలకు కారణమయ్యారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడినవారి సంఖ్య 10,000 మంది కాగా 2,279 వాహనాలు విపరీతమైన మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు వారిలో అత్యంత నిర్లక్ష్యంతో వాహనాలు నడిపే 136 మందిని అదుపులోనికి తీసుకొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com