ఢిల్లీలో AICC కార్యాలయంలో కోలాహలం.. నామినేషన్ వేసిన రాహుల్

- December 04, 2017 , by Maagulf
ఢిల్లీలో AICC కార్యాలయంలో కోలాహలం.. నామినేషన్ వేసిన రాహుల్

ఢిల్లీలోని AICC కార్యాలయంలో కోలాహలం నెలకొంది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన సందర్భంగా, యువరాజుకు మద్దతుగా అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలంతా తరలివచ్చారు. రాహుల్ తన పేపర్స్‌ రిటర్నింగ్ అధికారికి సమర్పించించారు. మొత్తం 4 సెట్ల నామినేషషన్లు దాఖలు చేశారు. రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సమర్థించారు. ఈ ఎన్నికల్లో ఇంత వరకూ ఎవరూ నామినేషన్ వేయనందున ఆయన ఎన్నిక లాంఛనం కాబోతోంది. ఇవాళ సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసాక ఎన్నికపై అధికారిక ప్రకటన రాబోతోంది. 

2013లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్, ఇప్పుడు అధ్యక్షుడు కాబోతున్నారు. ఆయనకు మద్దతుగా 93 సెట్ల నామినేషన్లు వచ్చాయి. అన్ని రాష్ట్రాల నుంచి PCC చీఫ్‌లు, ముఖ్యనేతలు, CWC సభ్యులు నిన్ననే ఢిల్లీకి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా రాహుల్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందర్నీ కలుపుకు వెళ్తారని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమాగా చెప్తున్నారు.

దాదాపు 20 ఏళ్లపాటు సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడా ఆమె వారసుడిగా తల్లి నుంచి పార్టీ బాధ్యతలు అందుకోబోతున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ నామినేషన్ వేసేముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశీస్సులు తీసుకున్నారాయన. అలాగే మన్మోహన్ ఇంటికి కూడా వెళ్లి ఆయన మద్దకు కోరారు. తర్వాత మన్మోహన్ సహా పార్టీ సీనియర్లు వెంట రాగా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచి 3 సెట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సెట్లు ఇలా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 93 సెట్లు ఫైల్ అయ్యాయి. ఇప్పటివరకూ అధ్యక్ష ఎన్నికలు జరిగిన వాటిల్లో ఇన్ని సెట్లు దాఖలవడం కూడా రికార్డే. గతంలో సోనియాగాంధీ పోటీలో ఉన్నప్పుడు 56 సెట్లు రాగా ఇప్పుడు యువరాజుకు సపోర్ట్‌గా ఈ నంబర్ 93కి  పెరగడం విశేషం. సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసాక రాహుల్ ఎన్నికపై అధికారిక ప్రకటన రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com