ప్రాధేయపడినా వినలేదు..అందుకే అలా చేశా..

- December 04, 2017 , by Maagulf
ప్రాధేయపడినా వినలేదు..అందుకే అలా చేశా..

చిత్తూరు జిల్లా దామరగుంటలో తన భార్య శైలజ మీద తొలిరాత్రే దాడి చేసి ఆమెను గాయపరచిన రాజేష్.ఇందులో తన తప్పేమీ లేదని సమర్థించుకోజూస్తున్నాడు. తను సంసార జీవితానికి పనికి రానని, అయితే తనలోని లోపాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను కోరానన్నాడు. పెళ్లి తనతోనే అయినా బంధాన్ని మరొకరితో సాగించుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పానని, అయినా శైలజ వినకపోవడంతో ఆగ్రహం పట్టలేకపోయానని తెలిపాడు.
ఈ విషయాన్ని శైలజ తన తలిదండ్రులకు చెబుతాననడంతో మరింత కోపంతో రగిలిపోయానని రాజేష్ చెప్పాడు. కాగా..అతని దాడిలో గాయపడిన శైలజ ఆసుపత్రిలో కోలుకుంటోంది..ఆమెను సోమవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజేష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com