శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం
- December 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం. అమెరికా వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 19 బుల్లెట్లు లభించాయి. నితిన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది..అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్‌కు చెందిన ఓటుకూరు నితిన్ రెడ్డి.. ఖతార్ ఎయిర్ లైన్సులో అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతని లగేజీ బ్యాగును స్కాన్ చేయగా..ఒకటి కాదు ఏకంగా 19 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో నితిన్ రెడ్డి అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. జంతువులను వేటాడానికి ఉపయోగించే హంటింగ్ బుల్లెట్లని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్లతో విమాన ప్రయాణం నేరం కాబట్టి నితిన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







