వెంకటేష్‌ కొత్త సినిమా ఆరంభం

- December 04, 2017 , by Maagulf
వెంకటేష్‌ కొత్త సినిమా ఆరంభం

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరన్నదీ ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. కాగా సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. వెంకటేష్‌, తేజ, పరుచూరి గోపాలకృష్ణ, అనిల్‌ సుంకర, రాజా రవీంద్ర తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబరు 16 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ ఈ ఏడాది 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన బాక్సర్‌గా కనిపించి, మెప్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com