ముగిసిన బహ్రెయిన్ లైట్ ఫెస్టివల్
- December 04, 2017
నవంబర్ 24న ప్రారంభమయిన బహ్రెయిన్ లైట్ ఫెస్టివల్ ముగిసింది. బహ్రెయిన్ బేలో బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. అన్ని వయసులవారినీ ఈ షో బాగా ఆకట్టుకుంది. ఫ్రాన్స్, జపాన్ మరియు అమెరికా నుంచి వచ్చిన కళాకారులు టెక్నికల్ ఆర్టిస్టిక్ డైనమిక్స్‌ని ప్రదర్శించి సందర్శకుల్ని విశేషంగా అలరించారు. ఎల్‌ఇడి డ్రమ్మర్స్, ఎల్‌ఇడి హోవర్ బోర్డర్స్, నియాన్ అంబ్రెల్లాస్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బహ్రెయిన్, అలాగే ఇతర దేశాల నుంచి సుమారు 80,000 మంది విజిటర్స్ ఈ షోని తిలకించారు. టూరిజం సెక్టార్‌కి ఊతమిచ్చేలా ఈ లైట్ ఫెస్టివల్‌ని నిర్వహించడం జరిగిందని బెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖాలిద్ బిన్ హుమూద్ అల్ ఖలీఫా చెప్పారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!