50 శాతం డిస్కౌంట్: జరీమానాల చెల్లింపుకు 90 రోజులు
- December 04, 2017
అబుదాబీ పోలీసులు, ట్రాఫిక్ జరీమానాలకు సంబంధించి 50 శాతం డిస్కౌంట్ని కన్ఫామ్ చేశారు. 90 రోజులపాటు ఈ డిస్కౌంట్ పీరియడ్ అందుబాటులో ఉంటుంది. సోమవారం అబుదాబీ పోలీస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 2న ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రారంభమయినట్లు అందులో పేర్కొన్నారు. 2016 ఆగస్ట్ 1 నుంచి 2017 డిసెంబర్ 1 వరకు నమోదైన జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్స్ని ఉద్దేశించి జరీమానాల్ని 50 శాతం తగ్గించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇయర్ ఆఫ్ గివింగ్ అలాగే 46వ యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







