పక్క భాషలోకి 'బ్రహ్మోత్సవం'

- December 05, 2017 , by Maagulf
పక్క భాషలోకి 'బ్రహ్మోత్సవం'

చెన్నై: మహేష్‌బాబు, కాజల్‌అగర్వాల్‌, సమంత, ప్రణీత తదితరులు నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. చిత్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో భద్రకాళి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెల్వందన్‌, ఇదుదాండా పోలీస్‌, మగధీర, బ్రూస్‌లీ, ఎవండా.. వంటి పలు చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని 'అనిరుధ్‌' పేరుతో అనువాదం చేస్తున్నారు. సత్యరాజ్‌, నాజర్‌, రేవతి, షియాజిషిండే, జయసుధలు ఇతర తారాగణం. మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చారు. కంభంకర్ణ, వెంకటేశన్‌, అంబికా కుమరన్‌, తిరుమలై సోము, యువకృష్ణ, రాజాలు పాటలు రాశారు. శ్రీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమిళంలో ఏఆర్‌కే రాజరాజా మాటలు రాశారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఇదో కుటుంబ కథా చిత్రం. కుటుంబసభ్యులు, బంధువులందరూ కలసి కూర్చుని చూడదగ్గ సినిమా.

ఇలాంటి వాటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. తమిళంలో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. దీపావళి, పొంగల్‌ వంటి పండుగలన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అలాంటి అనుభూతి కలుగుతుంద''ని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com