రేపటి నుండి సెట్స్ పైకి 'సైరా'
- December 05, 2017
మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ సైరా చిత్రం రేపటి నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో తొలి షెడ్యూల్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సంబంధించి మేకోవర్ పూర్తిగా మార్చుకోగా, టెస్ట్ షూట్ కూడా పూర్తైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సినిమాకి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ అందరిని సెలక్ట్ చేసినప్పటికి చివరి మూమెంట్ లో రెహమాన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని యూనిట్ ఆలోచనలో పడింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న సైరా చిత్రం బాహుబలి రికార్డులు తిరగరాసేలా రూపొందనున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల