రిజెక్ట్ అయిన విశాల్ నామినేషన్

- December 05, 2017 , by Maagulf
రిజెక్ట్ అయిన విశాల్ నామినేషన్

పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న హీరో విశాల్ ఆశలకు మొదట్లోనే గండి పడింది. చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నికలో విశాల్ ఈ సోమవారం నామినేషన్ వేశారు. వారం రోజుల తర్జన భర్జన తర్వాత తను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నడిగర్ సంగం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవులకు గండం వస్తుందని తెలిసినా.. విశాల్ రిస్క్ తీసుకున్నారు. కానీ.. అతడి నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా.. తన నామినేషన్ తో పాటు అదే నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్ల మద్దతు లేఖల్ని, వారి పూర్తి వివరాల్ని కూడా సమర్పించాలి. కానీ విశాల్ నామినేషన్ పత్రాల్లో కేవలం ఎనిమిది మంది అఫిడవిట్లు మాత్రమే సమగ్రంగా ఉన్నాయని, మరో ఇద్దరి పేపర్లు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇటు.. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ కూడా ఇటువంటి కారణంతోనే రిజెక్ట్ అయ్యిందట! తాజా పరిణామాల నేపథ్యంలో విశాల్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com