దుల్కర్ తో రీతువర్మ ఛాన్స్

- December 05, 2017 , by Maagulf
దుల్కర్ తో రీతువర్మ ఛాన్స్

'పెళ్లిచూపులు' సినిమాలో అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ రీతువర్మ. ఆ సినిమాతో నంది అవార్డును అందుకున్న ఈ భామ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. ఆ సినిమా తరువాత చాలా సినిమాలలో అవకాశాలు వచ్చినా.. రీతు మాత్రం తొందరపడలేదు. ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన ధ్రువనక్షత్రం చిత్రంలో చేస్తున్న రీతువర్మ మరో సినిమాకి సైన్ చేసింది. దుల్కర్ సల్మాన్ తమిళ్‌లో చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రీతువర్మ ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. 'కన్నుమ్ కన్నుమ్ కోలై' అనే టైటిల్‌తో చక్కని లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేసింగ్ ప్రియసామి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి రోజు షూటింగ్ సందర్భంగా రీతువర్మ.. దుల్కర్ సల్మాన్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com