హాలీవుడ్‌ చిత్రంలో నెపోలియన్‌

- December 05, 2017 , by Maagulf
హాలీవుడ్‌ చిత్రంలో నెపోలియన్‌

చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నెపోలియన్‌. గ్రామీణ పాత్రలు, పోలీసు అధికారి వంటి గాంభీర్యమైన పాత్రల్లో తిరుగులేని నటనను ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆ మధ్య రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగానూ హవా చాటుకున్నారు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో నటిస్తున్న ఆయన త్వరలోనే ఓ హాలీవుడ్‌ చిత్రంలో కనిపించనున్నారు. 'డెవిల్స్‌ నైట్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారాయన. వరుస హత్యలతో కూడిన థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఉన్న భారతీయుడిగా నటించారు నెపోలియన్‌. డెల్‌ గణేశన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ లోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com