యూఏఈ వెదర్: 3.8 డిగ్రీ సెల్సియస్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 05, 2017
వింటర్ సీజన్ నేపథ్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు యూఏఈ వ్యాప్తగా నమోదవుతున్నాయి. దమ్తా వద్ద ఉదయం 6.30 నిమిషాల సమయంలో అతి తక్కువగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రఖా ప్రాంతంలో 4.2 డిగ్రీల సెల్సియస్, జైస్ మౌంటెయిన్స్‌లో 4.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు వాతావరణం కొంతమేర క్లియర్‌గానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ప్రకారం చూస్తే, వెస్టర్న్ కోస్ట్స్‌తోపాటు ఐలాండ్స్‌లో వర్షపాతం నమోదవనుంది. లైట్ నుంచి మోడరేట్ విండ్స్ ఉంటాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సముద్రం కొంచెం రఫ్‌గా ఉండొచ్చు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







