తెలుగు నేతలకు గట్టిగా తగిలిన మోడీ మాటలు

- December 06, 2017 , by Maagulf
తెలుగు నేతలకు గట్టిగా తగిలిన మోడీ మాటలు

తెలంగాణాలో మైనార్టీలకు రిజర్వేషన్, ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇద్దరికీ అదిరిపోయే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. దేశంలో రిజర్వేషన్లను 50 శాతం పెంచడం సాధ్యం కాదన్నారు. పెంచే అవకాశం ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు.

గుజరాత్‌లో పటేల్ వర్గం తమకు రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. పటేల్ వర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినా.. దాని ప్రకంపనలు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. దేశమంతా ప్రధాని ఇదే మాట మీదుంటే మరి కాపులు, మైనార్టీల రిజర్వేషన్ల మాట ఏంటనే భయం తెలుగు నేతలకు పట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com