బహరేన్ లో గుండెపోటుతో మృతిచెందిన తెలంగాణ బిడ్డ

- December 06, 2017 , by Maagulf

బహరేన్ లో గుండెపోటుతో మృతిచెందిన తెలంగాణ బిడ్డ అల్లెపు గంగారాం, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో స్వగ్రామానికి మృతదేహం తరలింపు. 

  

నిజామాబాద్‌ జిల్లా, భీమ్‌గల్‌ మండలంలోని మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు గంగారాం (గంగాధర్) 38, పాస్పోర్ట్ నెంబర్ K8718854, ఈ జులైలో బహరేన్ కు వచ్చాడు ఇంతలోనే దురదృష్టవశాత్తు నవంబర్ 26 ఆదివారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వారి అకాల మరణం బాధాకరం అతనికి తల్లి, తండ్రి, భార్యతో పాటు నలుగురు ఆడా పిల్లలున్నారు, ఆ తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, భర్తను పోగొట్టుకున్న భార్య పెడుతున్న రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయాన్ని బంధువులు గంగరాజం, రాజన్న, నర్సయ్య ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, అతని కంపెనీ యజమాని/అధికారులతో మాట్లాడి పార్తివదేహం తో పాట్ మరో వ్యక్తికి టికెట్ ఇచ్చి మృతిచెందిన 11 రోజులో స్వగ్రామానికి 06.12.17 బుధవారం రోజు గల్ఫ్ఎయిర్ ప్లయిట్ GF274 ద్వారా ఉదయం 09:30గం: లకు శంషాబాద్‌కు పంపగా, ఎయిర్‌పోర్ట్‌ నుండి స్వగ్రామానికి రవాణా చేయడానికి టీఆర్ఎస్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, బాబురావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాగా. మృతిచెందిన బాదిత కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ తరుపున తమ వంతు సహాయాన్ని తొందరలోనే అందిచి ఆదుకుంటామని వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి తెలిపారు. వారి ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, నర్సయ్య, సాయన్న, ప్రమోద్, Ch రాజేందర్, భజన్న, వినోద్, వసంత్, శంకర్, రాజు, వెంకటేష్, రాంబాబు, బుచ్చిరెడ్డి, శేఖర్ తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com