అమృత విషయంలో వెలుగు చూస్తున్న ఆసక్తికరమైన విషయాలు

- December 06, 2017 , by Maagulf
అమృత విషయంలో వెలుగు చూస్తున్న ఆసక్తికరమైన విషయాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి... జయలలిత శోభన్ బాబుల కుమార్తె ను నేను అని సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన 37 ఏళ్ల అమృత ప్రాణ భయం అంటూ అజ్ఞాతంలోకి వెళ్లింది.. కాగా తనకు డీఎన్ ఏ పరీక్షలు చేయండి అని కోర్టు కి ఎక్కడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. చర్చకు దారితీసింది.. 
అమృత తాను జయలలితకు 1980 ఆగష్టు 14 న చెన్నై దగ్గర మైలాపుర్ లో ఆమె ఇంటిలో పుట్టినట్లు చెబుతుంది. తాను పుట్టిన సంగతి.. తనను జయలలిత సోదరి శైలజ, సారథి దంపతులకు అప్పగించిన సంగతి కొంత మంది బంధువులకు కూడా తెలుసు అని అమృత వాదిస్తున్నది. తాను పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటికి వెళ్ళి మొదటి సారి కలిసి నట్లు.. అపుడు తాము ఇద్దరం ఒకే కంచంలో భోజనం చేసి.. ఒకే చోట నిద్ర పోయినట్లు అమృత చెబుతున్నది.. అమృత చెబుతున్న విషయాలను జయలలిత చిన్ననాటి స్నేహితురాలు గీత కూడా సమర్ధించారు. జయలలిత, శోభన్ బాబులకు ఓ కుమార్తె పుట్టింది అని.. జయకు కుమార్తె ఉన్న విషయం శశికళ తో పాటు ఆమె సన్నిహితులందరికీ తెలుసు అని అంటున్నారు.. 

కాగా ఇదే విషయం పై అప్పట్లో సినీ విశ్లేషకురాలు..ప్రముఖ కవి ఆరుద్ర భార్య స్పందిస్తూ.. జయలలితకు ఓ కుమార్తె ఉన్నది అని ధృవీకరించారు. అంతేకాదు.. జయలలిత, శోభన్ బాబుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవని రామలక్ష్మి చెబుతున్నారు.. అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయకూడాదు అని నిర్ణయించుకోవడం వల్లే.. జయలలిత ను పెళ్లి చేసుకోలేక పోయారని.. రామ లక్ష్మి చెబుతున్నారు.. జయలలితకు ఆరుద్ర కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. దీంతో రామ లక్ష్మి వాదనతో అమృత జయ కూతురేమో అనే భావన అందరిలోనూ కలుగుతున్నది.. మొత్తం మీద అమృతకు డీఎస్ ఏ పరీక్షలు నిర్వహిస్తే.. చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని ఎక్కువమంది అభిప్రాయం..!! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com