గల్ఫ్ లో ఉపాధి అవకాశాలు క్రమేపి తగ్గుతున్నాయి!!
- December 06, 2017_1512572347.jpg)
యూఏఈ : ఎడారి దేశంలో ఎండనక..వాననకా కష్టించే లక్షలాదిమంది భారతీయులు గల్ఫ్దేశాలలో తమ చెమటను చిందింది స్వదేశంలోని తమ కుటుంబాలకు డబ్బులు పంపుతుంటారు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రంనుంచి లక్షలాదిమంది ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, యూఏఈ, బహ్రెయిన్… తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే అనేక కారణాల రీత్యా గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య ఇటీవల కాలంలో క్రమేపి తగ్గుతోంది. చమురు ఉత్పత్తి దేశాలైన గల్ఫ్‌దేశాలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, పర్యావరణహితమైన ఇంధన వనరులపై ప్రపంచదేశాలు దృష్టిసారించడం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న అనిశ్చితి… తదితర అంశాలతో గల్ఫ్‌దేశాల ఆదాయం తగ్గుతోంది. దీంతో ఈ ప్రభావం అక్కడకు వలస వెళ్లిన భారతీయ శ్రామికులపైన ఉండటంతో క్రమేణా గల్ఫ్ నుంచి భారత్‌కు వస్తున్న చెల్లింపులు తగ్గుతున్నాయి. 2016లో భారత్‌కు 62.7 బిలియన్ డాలర్లు చెల్లింపుల రూపంలో వచ్చాయి. అంతర్జాతీయంగా ఇతరదేశాల్లో ఉపాధి పొందుతున్న వివిధ దేశాలకు చెందిన వారి నుంచి చెల్లింపులు పొందడంలో ప్రథమస్థానంలో ఉంది. 61 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది.గల్ఫ్ నుంచి వచ్చే చెల్లింపులు భారత్‌కే ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చెల్లింపుల్లో ఎక్కువగా భారత్‌కే రావడం గమనార్హం. ఈ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు ఉన్నట్టు అంచనా. సౌదీఅరేబియాలోనే 30 లక్షలకు పైగా భారతీయులు వివిధ ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2013-2014 తో పోలిస్తే 2015-2016లో మన దేశానికి గల్ఫ్‌లోని భారతీయు ఉద్యోగులు, కార్మికుల నుంచి వచ్చే చెల్లింపులు తగ్గిపోవడం ఆందోళనకరం. కేరళ స్థూల జాతీయోత్పత్తిలో ప్రవాస భారతీయుల నుంచి వచ్చే చెల్లింపులు దాదాపు 36 శాతం ఉన్నట్టు సమాచారం.గత కొన్ని సంవత్సరాలుగా కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బంగాల్…తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువమంది గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళుతున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. వీరితో పాటు వియత్నాం, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగింది. భారతీయులకు ఇచ్చే వేతనాల కంటే తక్కువగా ఇతర దేశస్థులు ముందుకు రావడంతో యజమానులు వారిపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.గల్ఫ్‌ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా భారతీయ వలసలకు అడ్డుకట్టువేస్తున్నాయి. ఖతర్‌తో సౌదీ అరేబియాతో పాటు పలుదేశాలు దౌత్యసంబంధాలను తెంచుకోవడం చాలా ప్రభావం చూపింది. యెమెన్‌లో అంతర్యుద్ధం, ఇరాక్‌లో ఘర్షణలు..తదితర అంశాలతో గల్ఫ్‌కు వెళ్లాలనుకున్నప్పటికీ మానుకున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. మరో వైపు సౌదీలో అక్కడి పౌరులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భారతీయులకు అవకాశాలు తగ్గాయని వివిధ గణాంకాలు తెలియచేస్తున్నాయి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!