ఇరాన్ కు చెందిన పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న110 కిలోల హషీష్ స్వాధీనం

- December 06, 2017 , by Maagulf
ఇరాన్ కు చెందిన పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న110 కిలోల హషీష్  స్వాధీనం

కువైట్: ఇస్తాంబుల్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఇరాన్ నుంచి పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న 110 కిలోల  హుషీష్  మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. ఈ తనిఖీలో ఇరువురు కువైటీయులు మరియు ఐదుగురు ఇరానియన్లను రెడ్ హ్యాండడ్ గా అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న ఓ 42 ఏళ్ల కువైట్ దేశీయుడు దేశంలోకి 110 కిలోల హషీష్ ను అక్రమ రవాణా  చేయాలని ప్రణాళిక రచించాడు. ఆ అనుమానితుడిని పోలీసుల నిఘాలో ఉండటంతో . నార్కోటిక్స్ డిటెక్టివ్ లు మంగళవారం ఆ నిందితుడిని అనుసరిస్తూ వెళ్లారు. ఫింటాస్  నుండి ఒక పడవలో సముద్రంలోకి వెళ్లారు, అతనితో పాటు మరొక కువైట్ సహచరుడితో వెళ్ళాడు.  వీరి రాక కోసం ఎదురు చూస్తున్న ఐదుగురు ఇరానియన్లు  వారికి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాన్ని అందచేస్తున్న సమయంలో  తనిఖీ అధికారులు వీరి వ్యవహారాన్ని అడ్డుకొని  వారి రెండు  పడవలతో  పాటు ఏడుగురు నిందితులను  110 కిలోల హషిష్  స్వాధీనం చేసుకొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com