వృత్తి ఎంపికలో నర్సింగ్ చదువు పట్ల ఆసక్తి చూపుతున్న కతర్ యువత

- December 06, 2017 , by Maagulf
వృత్తి ఎంపికలో నర్సింగ్ చదువు పట్ల ఆసక్తి చూపుతున్న కతర్ యువత

కతర్: కతర్ ఆరోగ్య వ్యవస్థలో నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది మరియు దేశంలో పశ్చిమ మరియు సెంట్రల్ ప్రాంతాల్లో కనీసం 24 మందికి పైగా కతర్ నర్సులుక్ ప్రాథమిక ఆరోగ్య సంరణ కార్పొరేషన్ (పి హెచ్ సి సి )ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు చేసాయడం విశేషం . నర్సింగ్ వృత్తి ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో కీలకమైనది. ఆరోగ్య సంరక్షణ, ప్రసవం విధానం ప్రస్తుత మరియు భవిష్యత్తులో సైతం  ప్రభావితం చేసే సామర్థ్యం మరియు బాధ్యత వారు కలిగి ఉన్నారు, ప్రాథమిక ఆరోగ్య సంరణ కార్పొరేషన్  లో ఒక ఖతరీ నర్సు మరియు ఆపరేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన అఫ్రా అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,  "మేము వివిధ  రోగులతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుచుకుంటూ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ ఒక ప్రత్యేకమైన పాత్రను కలిగి ఉందని నిరూపిస్తున్నాం. మా సేవల ద్వారా రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ  వారికి మద్దతు ఇచ్చేవిధంగా సంపూర్ణ సేవను అందిస్తున్నట్లు తెలిపారు. ఆ విధమైన సేవలను ఆపదలో ఉన్నవారికి అందించేందుకు ప్రభుత్వపరంగా మరింతగా ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. నర్సులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చి మరింత  సాధికారమివ్వటానికి వైద్యాధికారులు తోడ్పడాలని ఆమె కోరింది. నర్సింగ్ వృత్రిని ఎంపిక చేసుకొన్నవారిని ప్రముఖ స్థానములో ఉంచగల ఆరోగ్య సంరక్షణ నమూనాను కలిగి ఉండాలి, ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలకు సానుకూల సహకారం అందించినట్లైతే , నర్సులు మరింత అంకితభావంతో తమ బాధ్యతను పూర్తి చేయగలరని ఆమె చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com