వేసవి కి రెడీ అంటున్న 'కాంచన 3'
- December 06, 2017'ముని' చిత్రంతో హర్రర్ బాటలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస హిట్లతో విజృంభిస్తున్నారు. ఆ సినిమాకు సీక్వెల్గా ఇప్పటి వరకు మూడు సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నారు. రెండో సీక్వెల్ 'కాంచన'గా, ఆ తర్వాత చిత్రం 'కాంచన 2'గా వచ్చింది. ఇప్పుడు 'కాంచన 3' తెరకెక్కుతోంది. దీన్నే 'ముని 4'గా కూడా చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఓవియా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో ఓవియా ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం లారెన్స్, ఓవియాకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించామని పేర్కొంటున్నాయి. 'బిగ్బాస్' కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న ఓవియాకు ఈ సినిమా మరో బ్రేక్ ఇస్తుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా