జిసిసి నుంచి వీడి ...వేరే కుంపటి పెట్టె యోచనలో యుఏఈ, సౌదీ అరేబియా

- December 07, 2017 , by Maagulf
జిసిసి నుంచి వీడి ...వేరే కుంపటి పెట్టె యోచనలో యుఏఈ, సౌదీ అరేబియా

యుఏఈ: ' కలిసి ఉంటే కలదు సుఖం ' అంటూ ఘనంగా ఏర్పాటైన  గల్ఫ్‌ సహకార సమాఖ్యలో (జిసిసి) లో ముసలం పుట్టింది. నేతల మధ్య లుకలుకలు మొదలై చివరకు తాము వేరుపడుతున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీ అరేబియాతో కలిసి తాము ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. జిసిసి నుండి వేరుపడి మరో ‘సంయుక్త సహకార మండలి’ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఆమోదించినట్లు ఎమిరేట్స్‌ విదేశాంగ శాఖ తన ప్రకటనలో వివరించింది. అయితే ఎమిరేట్స్‌ ప్రతిపాదనపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు అన్నట్లు తెలుస్తుంది. కొత్త మండలిలో ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా మధ్య సైనిక, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే అంశంపై మిత్రదేశాలతో సమన్వయపరచి సహకారాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమిరేట్స్‌ విదేశాంగశాఖ తన ప్రకటనలో వివరించింది. అయితే ఈ కొత్త కూటమిలోకి ఇతర గల్ఫ్‌ దేశాలకు కూడా ఆహ్వానం ఉందా లేదా అన్నది మాత్రం తమ ప్రకటనలో ప్రస్తావించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com