చింత చిగురుతో బొమ్మిడాయిలు, మామిడికాయ
- December 07, 2017కావలసిన పదార్థాలు: బొమ్మిడాయిలు - నాలుగు, మామిడికాయ - ఒకటి, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయలు - రెండు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టీస్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బొమ్మిడాయిలను తల, తోక తీసేసి రెండు లేదా మూడు అంగుళాల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బొమ్మిడాయి ముక్కలు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు దోరగా వేగించి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా వేగిన తరువాత చింతచిగురు, మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంటమీద ఉంచాలి. పదినిమిషాల తర్వాత నీళ్ళు, ఉప్పు వేసి, వేగించి పెట్టుకున్న బొమ్మిడాయిల ముక్కలు, గరం మసాలా కూడా వేసి కూర దగ్గర పడ్డాక దించేయాలి.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక