తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- May 21, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్‌ఎస్ సర్కార్ 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను నియమించింది.
ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్‌లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈరోజుతో ముగియడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జి వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, జేఎన్‌టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్‌కు అప్పగించింది. కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీకి వీసిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు.
అలాగే మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కి జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా నదీం అహ్మద్‌ను నియమించింది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







