హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- May 21, 2024
అహ్మదాబాద్: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది.160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కేవలం 1.34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులతో లక్ష్యాన్ని కోల్‌కతా ఛేదించింది.ఫలితంగా హైదరాబాద్‌ను ఓడించి.. కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ ఫైనలిస్టుగా కోల్‌కతా నిలిచింది.
కోల్‌కతా ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (23) సునీల్ నరైన్ (21) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించగా.. వెంకటేష్ అయ్యర్ (51 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచి అదరగొట్టారు. హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ బౌలర్లో కెప్టెన్ పాట్ కమిన్స్, టి నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.హైదరాబాద్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ (3/34)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.ప్రత్యర్థి జట్టు కోల్‌కతాకు 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ ఆదిలోనే చేతులేత్తేయగా అభిషేక్ వర్మ (3) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 13.2 ఓవర్లో జట్టు స్కోరు 121 వద్ద త్రిపాఠిని ఆండ్రీ రసెల్ రనౌట్ చేయడంతో 6వ వికెట్‌గా వెనుదిరిగాడు.
మిగతా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెస్ (32) పరుగులతో రాణించగా, అబ్దుల్ సమద్ (16) పేలవ ప్రదర్శనతో నిష్ర్కమించాడు. చివరిలో పాట్ కమిన్స్ (30)తో మెరిసినప్పటికీ ఆండ్రీ రస్సె ల్ బౌలింగ్‌లో రహ్మానుల్లాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విజయ్ కాంత్ వియస్కాంత్ (7 నాటౌట్)కు పరిమితయ్యాడు.
మొత్తానికి హైదరాబాద్ ఆటగాళ్లు క్వాలిఫైయర్ -1లో పేలవ ప్రదర్శనతో బ్యాటింగ్‌లో తేలిపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ననరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







