గాజాపై ఇజ్రాయెల్ దాడులు
- December 09, 2017
గాజా: పాలస్తీనాలోని గాజాపై శనివారం తెల్లవారు జామున ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగింది. వెస్ట్‌బ్యాంక్ -గాజా ప్రాంతంలో పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఇద్దరు పాలస్తీనా పౌరులు మరణించారు. గాజాలోని తీవ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడుల జరిపామని ఇజ్రాయిల్ మిలటరీ ప్రకటించుకుంది. శక్తివంతమైన క్షిపణుల్ని గాజాలోని వివిధ ప్రాంతాలపై ప్రయోగిం చింది. శనివారంనాటి ఈ దాడుల్లో దాదాపు 25 మంది పాలస్తీనా పౌరులు తీవ్రంగా గాయపడ్డారని, ఇందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారని వార్తలు వెలువడ్డాయి.
అంతకుముందు శనివారం అర్థరాత్రి సమయం లో హమాస్ గ్రూపు మూడు క్షిపణులను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ నేలకూల్చింది. మరొకటి కొంతదూరం ప్రయాణించి కుప్పకూలగా.. ఇంకొకటి మాత్రం నగరాన్ని తాకింది. దీంతో ప్రతీకార చర్యగా ఇజ్రా యెల్ రాత్రికిరాత్రి గాజాపై విచక్షణారహితంగా దాడి కి పూనింది. తాము ఉగ్రవాదుల్ని లక్ష్యంగా ఎంచు కొని దాడుల్ని జరిపామని ఇజ్రాయెల్ మిలటరీ సమ ర్థించుకుంది. ఇజ్రాయిల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆవర్భవించిందే 'హమాస్'. గాజా-వెస్ట్‌బ్యాంక్‌లో దీనికి పట్టు ఉంది.
పాలస్తీనాను క్రమ క్రమంగా ఇజ్రాయిల్ ఎలా ఆక్రమించిందో చెప్పడానికి చిన్న ఉదాహరణ గాజా- వెస్ట్‌బ్యాంక్ సమస్య. వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించడానికి ఇజ్రాయిల్ 1948, 1967ల్లో యుద్ధాలు చేసింది. 1967లో తన ఆయుధ బలంతో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌ను పూర్తిగా ఆక్రమించుకుంది. గాజా విషయంలో పాలస్తీనా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రైంది. ఇప్పుడు గాజా ప్రాంతం పాక్షికంగా ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది. క్రమ క్రమంగా ఈ ప్రాంతాలకు యూదుల వలసలను ప్రోత్సహించి, అక్రమ కట్టడా లను నిర్మించింది. మరోవైపు అక్కడి పాలస్తీ నియులపై అణిచివేతకు పాల్పడింది. ప్రస్తుతం గాజాను కేంద్రంగా చేసుకున్న హమాస్ ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







