సుమన్ వల్లే హీరో అయ్యా అంటోన్న రాజశేఖర్

- December 09, 2017 , by Maagulf
సుమన్ వల్లే హీరో అయ్యా అంటోన్న రాజశేఖర్

డా. రాజశేఖర్‌ మాట్లాడుతూ మామ ఓ చందమామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ... ''నేను మెడికల్‌ కాలేజ్‌లో వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు సుమన్‌గారికి పెద్ద ఫ్యాన్స్‌ వుండేవారు. బేసిగ్గా ఆయన కరాటే మాస్టర్‌. ఎప్పుడూ ఫిట్‌గా వుంటారు. నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ వుంది. వండ్రఫుల్‌ పర్సన్‌. ఆయన బిజీగా వుండి డేట్స్‌ కుదరకపోవడంతో 'వందేమాతరం' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు టి.కృష్ణగారు. సుమన్‌గారు చేయకపోవడంతో ఆ సినిమాలో నేను నటించాను. సుమన్‌గారి వల్లే నేను హీరోని అయ్యాను. రామ్‌ కార్తీక్‌ మా పిల్లలకు మంచి ఫ్రెండ్‌. స్టైలిష్‌గా వున్నాడు. మంచి స్మైలింగ్‌ ఫేస్‌. చాలా ప్లెజెంట్‌గా వున్నాడు. ట్రైలర్‌ చూశాక సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకం కలిగింది. మున్నా మ్యూజిక్‌ వినసొంపుగా వుంది. డైరెక్టర్‌ వెంకట్‌ చాలా బాగా తీశాడు. సినిమా బాగా వచ్చింది అని సుమన్‌గారు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com